ప్రభుత్వాసుపత్రిలో మళ్లీ మితిమీరి పోతున్న వివాదస్పద ఓ సూపర్వైజర్ ఆగడాలు...

గోదావరిఖని ప్రభుత్వ అస్పత్రిలో ఓ సూపర్ వైజర్ ఆగడాలు మళ్లీ మిత్తిమీరిపోతున్నాయి. గతంలో ఇలాగే ప్రభుత్వ అస్పత్రిని వివాదాలకు నీలాయంగా మర్చి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించిన ఘనత సదురు సూపర్ వైజర్ కే దక్కింది. అయితే సదురు సూపర్ వైజర్ చేసిన ఘనకార్యంతో కొంత మంది వైద్యులు, సిబ్బంది సైతం రోడ్డెక్కిన ఘటనలు చోటు చేసుకోవడంతో ఉన్నతధికారులు సదురు సూపర్ వైజర్ ను విధుల్లో నుండి తొలగించినట్లు ఆదేశాలు జారీ చేసారు. ఇది ఎన్నో రోజులు నిలవలేదు. అది అధికారుల నామమాత్రపు చర్యల లేక ఆ సమయంలో తప్పును కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంమో తెలియదు కాని పోలీస్ స్టేషన్ లో కేసు నడుస్తూ ఉండగానే మళ్లీ యధావిధిగా అస్పతిలో విధుల్లో చేరడం తన ప్రవర్తన మార్చుకోకుండా అలాగే కొంత మంది సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం మొదలు పెట్టినట్లు అస్పత్రి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. దీనికి తోడు సదురు సూపర్ వైజర్ అండదండలతో పెషేంట్ కేర్ విభాగంలో కొత్తగా చేరిన ఓ మహిళ కూడా తోటి సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదురు మహిళ నియామకంలో దాదాపు 2 లక్షల రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతుంది.

అధికారులకు ఎందుకంత ఆ సూపర్ వైజర్ మీద ప్రేమా... ⁉️


అస్పతికి వచ్చే పేషంట్లతో మర్యాదగా ప్రవర్తించాలి. తోటి సిబ్బందితో కలసి మెరుగైన సౌకర్యలు ఏర్పాటు చేయాలి. ఇలా ఎన్నో నీతి వ్యాఖ్యలు చేసే అధికారులకు సదురు సూపర్ వైజర్ అస్పత్రిలో చేసే ఆగడాలు కనిపించడం లేదా... ⁉️ అధికారులకు ఎందుకు సదురు సూపర్ వైజర్ మీద ఇంత ప్రేమా అనే అనుమానాలు అందరిలోను వ్యక్తం అవుతున్నాయి. ఒక్కప్పుడు డెలివరీ పెషేంట్ల వద్ద డబ్బులు తీసుకున్నారని ముగ్గురు సిబ్బందిని ఉన్న ఫలంగా విధుల్లో నుండి పర్మినెంట్ గా తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసిన అధికారులు సూపర్ వైజర్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే సదురు సూపర్వైజర్ అండదండలతో విధుల్లో చేరిన పేషంట్ కేర్ విభాగానికి సంబంధించిన ఓ మహిళ డెలివరీ అయిన పేషెంట్ల వద్ద నుండి సుమారుగా ఒక్కొక్కరి వద్ద వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్న అధికారులకు తెలియదా తెలిసి కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనాడు ముగ్గురు సిబ్బందిపై తీసుకున్న చర్యలు ఈనాడు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనిపై అధికారులు పూర్తి విచారణ చేపడతారా లేక నీరుగార్చి సూపర్వైజర్ కే మళ్ళీ లాభం చేకూరుస్తారా అనేది వేచి చూడాల్సిందే... దీనిపై పూర్తి వార్తా కథనం, పూర్తి వివరాలతో రేపటి ఆకాంక్ష న్యూస్ లో...