సూపర్వైజర్ పై చర్యలు ఇంకెప్పుడు.. ⁉️

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల “సిబ్బంది పాలిట శాపంగా మారుతున్న అధికారుల నామమాత్రపు చర్యలు” అనే శీర్షికతో "తొలి ఆకాంక్ష" దినపత్రికలో ప్రచురితమైన కథనంలో పెషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి డెలివరీ కేసుల పేరుతో రోగుల కుటుంబ సభ్యుల నుంచి రూ.1000 వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.ఈ కథనం వెలుగులోకి రావడంతో వెంటనే స్పందించి సిబ్బందితో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. అనంతరం జరిగిన అంతర్గత విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత మహిళా ఉద్యోగిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారానికి అండగా నిలుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సూపర్వైజర్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆసుపత్రి వర్గాల్లో చర్చకు దారి తీసింది. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అధికారుల పేర్లు చెప్పుకుని సిబ్బందిని బెదిరించడం వంటి ఆరోపణలు సదరు సూపర్వైజర్‌పై వినిపిస్తున్నాయి. గతంలో ఆయన వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినప్పటికీ మళ్లీ విధుల్లో కొనసాగించడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సూపర్వైజర్ వ్యవహార శైలితో ఆసుపత్రిలో పలువురు మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వసూళ్ల వ్యవహారంలో మహిళా ఉద్యోగిపై మాత్రమే చర్యలు తీసుకుని, అసలు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

సూపర్వైజర్ పై చర్యలు ఇంకెప్పుడు.. ⁉️


ఆస్పత్రిలో మహిళ ఉద్యోగుల పట్ల ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ అధికారుల పేరు చెప్పుకొని సిబ్బందిని బెదిరింపులకు గురి చేస్తున్న సదరు ఓ సూపర్వైజర్ పై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు సూపర్వైజర్ చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లే పరిస్థితి వచ్చిన మళ్లీ ఆయనను విధుల్లో కొనసాగించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదురు సూపర్వైజర్ వ్యవహార శైలితో ఎంతో మంది మహిళా ఉద్యోగులు ఆసుపత్రిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సదరు సూపర్వైజర్ పై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...