ముంబై షోకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్వాహకులు మరో అదనపు షోను ఖరారు చేశారు. ఏప్రిల్ 11న మహాలక్ష్మి రేస్‌కోర్స్ వేదికగా మూడవ ప్రదర్శన జరగనుంది.

ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగించే పాప్ కన్సర్ట్‌లకు భారత్ ఇప్పుడు ఒక ప్రధాన వేదికగా మారింది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయి పాప్ సింగర్లు భారతదేశంలో పర్యటించి ఇక్కడి అభిమానులకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చారు. తాజాగా ఈ జాబితాలోకి గ్లోబల్ పాప్ సెన్సేషన్ షకీరా వచ్చి చేరడం విశేషం. భారత్‌లో లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన లేదా ఇవ్వబోతున్న టాప్-5 విదేశీ పాప్ సింగర్ల వివరాలను పరిశీలిస్తే మన దేశంలో పాప్ సంగీతానికి ఉన్న క్రేజ్ అర్థమవుతుంది.

షకీరా పేరు వినగానే త‌న‌ విలక్షణమైన గాత్రం.. అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ గుర్తొస్తాయి. భారతదేశంలో షకీరాకు ఉన్న ఫ్యాన్ బేస్ అసాధారణమైనది. ఆమె ఇండియా టూర్ ప్రకటన రాగానే ముంబై, ఢిల్లీ నగరాల్లోని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. షకీరా ప్రదర్శన అంటే స్టేజ్ మీద ఎనర్జీ సలసల కాగిపోవడం గ్యారెంటీ అని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 10న ముంబైలో, ఏప్రిల్ 15న ఢిల్లీలో నిర్వహించనున్న షోలకు భారీ స్పందన లభించింది.

ముంబై షోకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్వాహకులు మరో అదనపు షోను ఖరారు చేశారు. ఏప్రిల్ 11న మహాలక్ష్మి రేస్‌కోర్స్ వేదికగా మూడవ ప్రదర్శన జరగనుంది. ఈ వార్తతో ముంబై వాసుల ఆనందానికి అవధులు లేవు. కేవలం షకీరా పాటలే కాకుండా.. త‌న‌ ప్రదర్శనలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ , కొరియోగ్రఫీ కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఈవెంట్లలో ఒకటిగా నిలవనుంది.